మమిత బైజు.. ఒక్క పొరపాటుతో ఆమె జీవితమే మారింది

 


కొన్నిసార్లు జీవితంలో అనుకోకుండా జరిగే పొరపాట్లు మొత్తం ఇమేజ్ మారడానికి కారణం అవుతాయి. చిన్న చిన్న విషయాలే ఊహించని స్థాయిలో ఫేమ్ ని తీసుకొని వస్తాయి. తెలియకుండా చేసిన పనులు అనుకోని అదృష్టాన్ని తీసుకొస్తాయి. ఇప్పుడు మలయాళీ హీరోయిన్ పేరు విషయంలో నర్స్ లు చేసిన చిన్న తప్పు ప్రస్తుతం ఆమె ఇమేజ్ ని మార్చేసిందని చెప్పాలి.  సౌత్ లో ప్రస్తుతంగా బలంగా వినిపిస్తోన్న పేరు మమిత బైజు. ప్రేమలు సినిమాతో మమిత ఊహించని స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రేమలు చిత్రానికి ముందు వరకు ఆమె మలయాళీ పరిశ్రమకి మాత్రమే పరిమితం. 2017లోనే నటిగా మమిత బైజు ప్రయాణం మొదలుపెట్టింది. కానీ ప్రేమలు మూవీ ఆమెకి స్టార్ హీరోయిన్ ఇమేజ్ తీసుకొచ్చింది. ఈ సినిమాలో మమిత పెర్ఫార్మెన్స్ కి కుర్రాళ్ళు క్లీన్ బౌల్డ్ అయిపోయారు.
 


దీంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన మమితకి తెలుగు, తమిళ్ భాషల నుంచి అవకాశాలు వస్తున్నాయి. తమిళం ఇండస్ట్రీలో ఇప్పటికే రెబల్ అనే సినిమాతో మమిత ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో జీవీ ప్రకాష్ కుమార్ కి జోడీగా మమిత నటించింది. తెలుగులో పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ ల నుంచి ఈ మలయాళీ పిల్లకి అవకాశాలు వస్తున్నాయి. నిజానికి మమితకి ఆమె తల్లిదండ్రులు నమిత అని పేరు పెట్టారంట. అయితే హాస్పిటల్ గా ఆమె బేబీగా ఉన్నప్పుడు నర్స్ లు ఎన్ కి బదులుగా ఎమ్ అని బర్త్ సర్టిఫికెట్ లో రాసారంట. మమిత స్కూల్ లో జాయిన్ అయ్యే సమయంలో పేరు తప్పుగా రాసారని గ్రహించారంట. ముందు మార్చాలని అనుకున్న కూడా మమిత అనే పేరు కూడా కొత్తగా ఉండటంతో దానినే కొనసాగించారంట.

అలా నమిత బైజు కావాల్సిన ఈ బ్యూటీ మమిత బైజు అయ్యిందంట. ఈ విషయాన్ని ఆమె ఓ మలయాళీ ఇంటర్వ్యూలో పేర్కొంది.  మమిత అంటే మలయాళంలో మిఠాయి అని అర్ధం అంట. పేరులో స్వీట్ ఉండటంతో పేరెంట్స్ మమితని కొనసాగించేసారు. మొత్తానికి అలా నర్స్ లు తప్పుగా రాసిన ఒక్క లెటర్ ప్రస్తుతం ఆమె ఫేమ్ నే మార్చేసిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. త్వరలో మమిత బైజు టాలీవుడ్ లో ఎంట్రీ మూవీకి సంబందించిన కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

Post a Comment

Previous Post Next Post