గుంటూరు కారం గాయానికి.. టిల్లు మందు!


టిల్లు స్క్వేర్ సూపర్ సక్సెస్ తర్వాత టిల్లూ మేకర్స్ టిల్లు క్యూబ్ ప్రకటించిన విషయం తెలిసిందే. సిద్ధు జొన్నలగడ్డ అతని టీమ్ స్క్రిప్ట్‌పై వర్క్ చేయడం ప్రారంభించింది. వచ్చే ఏడాది షూటింగ్ ఫార్మాలిటీస్ ప్రారంభం కానున్నాయి.  సూర్యదేవర నాగవంశీ మార్కెట్ అంచనాలను దృష్టిలో ఉంచుకుని టిల్ క్యూబ్‌కు భారీ బడ్జెట్‌ తోనే నిర్మిస్తున్నారు.  ఇందులో కథానాయిక పాత్ర కోసం పూజా హెగ్డేని సంప్రదించినట్లు తాజా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 


పూజా పాప సక్సెస్ ట్రాక్ లో లేకపోయినప్పటికీ ఆమెకు ఈ అవకాశం ఇవ్వడానికి ప్రధాన కారణం గుంటూరు కారం దెబ్బె. ఆ సినిమా షూటింగ్ కొంత ఫినిష్ అయిన తరువాత ఆమెను తీసేసిన విషయం తెలిసిందే. ఇక హారిక హాసిని - సితార నాగవంశీ ఒకటే కాబట్టి టిల్లు 3లో ఛాన్స్ ఇస్తున్నారు. ఇక MAD ఫేమ్ కళ్యాణ్ టిల్ క్యూబ్‌కి దర్శకత్వం వహించనున్నాడు. రామ్ మిర్యాల సంగీతం అందించనుండగా, సిద్ధూ ఈ చిత్రానికి టెక్నీషియన్లందరినీ రిపీట్ చేయనున్నారు. అతను ప్రస్తుతం బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో జాక్ అనే సినిమా చేస్తున్నాడు. మరోవైపు నీరజ కోన దర్శకత్వంలో తెలుసు కదా అనే సినిమా కూడా సెట్స్ పైనే ఉంది.  ఈ రెండు సినిమాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి.

Post a Comment

Previous Post Next Post