విజయ్ దేవరకొండ.. ఆ రోజే మూడు క్రేజీ అప్డేట్స్

 


విజయ్ దేవరకొండ బిగ్ హిట్ కొట్టి చాలా రోజులైంది. అయినప్పటికీ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. మే 9న పుట్టినరోజు కావడంతో రాబోయే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తో మంచి బజ్ క్రియేట్ చేయబోతున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న కొత్త సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నారు మేకర్స్. సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.


ఇక యాక్షన్‌తో కూడిన గ్రామీణ ఎంటర్‌టైనర్ కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమాకు రవికిరణ్ కోలా దర్శకుడు కాగా, దిల్ రాజు నిర్మాత. రౌడీ జనార్దన్ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్న ఈ చిత్రానికి మే 9న టైటిల్‌ను ప్రకటించనున్నారు. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణ ప్రారంభమవుతుంది. అలాగే విజయ్ శ్యామ్ సింఘా రాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ తో కూడా ఒక చిత్రానికి ఓకే చెప్పాడు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మే 9 న రానుంది.  మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది. 

Post a Comment

Previous Post Next Post