రాజమౌళి ఒక్క మాటతో.. మహేష్ ప్లాన్ క్యాన్సిల్


రాజమౌళితో సినిమా చేయడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆయన ఏ హీరోతో సినిమా చేసిన కూడా చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అందుకే జక్కన్న ముందుగా తన అనుకున్న కథకు పలానా హీరో సెట్ అవుతాడా లేదా అనే విషయం కన్నా అతను కమిట్మెట్ తో కష్టపడతాడా లేదా అనే విషయాన్ని ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటాడు. ఎండ ఎక్కువైనా, వరద వచ్చినా కూడా రాజమౌళి షార్ట్ సెట్ చేశాడు అంటే అందులో కష్టపడి నటించాల్సిందే. 


జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కూడా RRR సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ అయితే చేశారు. ఇక అంతకుముందు బాహుబలి ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు మహేష్ బాబు టైమ్ వచ్చింది. రాజమౌళి గురించి అతనికి బాగా తెలుసు కాబట్టి ముందుగానే మెంటల్ గా ఫిజికల్ గా మహేష్ తనను తాను ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాడు.

ఇక రీసెంట్ గా ఫ్యామిలీ తో కలిసి హాలిడే వెకేషన్ కి వెళదామని అనుకున్నప్పటికీ రాజమౌళి సడన్ గా వర్క్ షాప్ లో పాల్గొనాల్సి ఉంది అని చెప్పడంతో వెంటనే ఆ ట్రిప్ క్యాన్సిల్ కూడా చేసుకున్నాడు. అంతలా మహేష్ రాజమౌళి ఆధీనంలోకి వచ్చేసాడు. వరుసగా 4 వారాల పాటు SSMB29 వర్క్ షాప్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో టెక్నీషియన్స్ మాత్రమే కాకుండా మరికొందరు ప్రముఖ నటీనటులు కూడా పాల్గొనబొతున్నట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post