విజయ్ దేవరకొండ బడ్జెట్ లెక్కలు.. 300 కోట్లు!


రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నెక్స్ట్ చేయబోయే సినిమాల బడ్జెట్ గతంలో కంటే ఎక్కువగానే ఉండబోతున్నట్లుగా అనిపిస్తుంది. ముందుగా దిల్ రాజు ప్రొడక్షన్ లో అతను ఒక యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయబోతున్నాడు. అందులో కత్తి పట్టి విలన్స్ ను ఊచకోత  కోసే యాక్షన్ సీన్స్ మామూలుగా ఉండవు అని కలుస్తోంది. ఈ సినిమాపై దాదాపు 50 నుంచి 60 కోట్ల రేంజ్ లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 


అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ లో గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న సినిమా కూడా దాదాపు అదే రేంజ్ బడ్జెట్లో రూపొందుతోంది. ఈ సినిమాలో విజయ్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. పిరియాడిక్ నేపథ్యంలో ఎంచుకున్న కథ కాబట్టి సెట్స్ కోసం ఇందులో భారీగానే ఖర్చు పెడుతున్నారు. చివరికి వచ్చేసరికి అనుకున్న బడ్జెట్ కంటే కొంత పెరగవచ్చు కూడా. ఇక మైత్రి మూవీ మేకర్స్ లో విజయ్ మొదటిసారి చారిత్రాత్మక నేపథ్యంలో ఒక సినిమా చేయబోతున్నాడు.

1800 కాలానికి సంబంధించిన ఒక హిస్టారికల్ పాయింట్ ను దర్శకుడు రాహుల్ ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి 100 కోట్ల బడ్జెట్ కంటే ఎక్కువగానే ఖర్చు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక రాబోయే ఈ మూడు సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే రూపొందనున్నాయి. కాబట్టి సినిమాల ఫైనల్ అవుట్ ఫుట్స్ వచ్చేసరికి ఖర్చు గట్టిగానే అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా ఈ మూడు సినిమాలకు కలిపి విజయ్ పై పెట్టుబడుల లెక్క 300 కోట్లు దాటే అవకాశం ఉంది.

Post a Comment

Previous Post Next Post