ప్రతినిధి2 మూవీ - రివ్యూ & రేటింగ్


కథ:

రాష్ట్ర సీఎం ప్రజాపతి (సచిన్ ఖేడ్కర్) రెండోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతుంటారు. అయితే హఠాత్తుగా ఓ రాత్రి క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్న దుండగులు బాంబు దాడి చేసి ఆయనను హత్య చేస్తారు. అనంతరం కొడుకు విశ్వం (దినేష్ తేజ్) ముఖ్యమంత్రి కావాలని అనుకుంటాడు. ఇక రంగంలోకి చేతన్ (నారా రోహిత్) జర్నలిస్టుగా రంగంలోకి దిగుతాడు. చేతన్ ముఖ్యమంత్రి మరణం గురించి ఏం తెలుసు కుంటాడు? సిబీఐకి ఎలాంటి నిజాలు తెలిశాయి? చివరికి దినేష్ వారసత్వంతో సీఎం సీటు దక్కించుకున్నాడా? అసలు రెండు సార్లు గెలిచిన ముఖ్యమంత్రిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? అనే అంశాలు సినిమాలోని అసలు అంశాలు.


విశ్లేషణ:
టాలెంటెడ్ హీరో నారా రోహిత్ చాలా గ్యాప్ తీసుకుని చేసిన ఈ చిత్రం ట్రైలర్ తోనే ఇండస్ట్రీలో కంటే ఎక్కువగా రాజకీయాల్లోనే హాట్ టాపిక్ గా నిలిచింది. హూ కిల్డ్ సీఎం? పాయింట్ తోనే సగం హైప్ క్రియేట్ చేశారు, ఆ విషయం పక్కన పెడితే సినిమాలో ఓటు హక్కు గురించి తెలియజేసిన విధానంకు దర్శకుడిని మెచ్చికొని తీరాలి. దాని వెనకాల అల్లుకున్న కథ ప్రస్తుత రాజకీయ అంశాలపై ఎన్నో ఆలోచనలను కలిగిస్తూ ఉంటాయి. దర్శకుడిగా మూర్తి తన అనుకున్న పాయింట్ ను ఇంటర్వెల్లో అలాగే క్లైమాక్స్లో మరింత ఎక్కువగా హైలెట్ చేసే ప్రయత్నం చేశారు.

ప్రతి పాత్రకు కూడా కథకు కనెక్షన్ ఉండేలా ఆయన స్క్రీన్ ప్లే సిద్ధం చేసుకున్న విధానం కూడా మెయిన్ హైలెట్ గా నిలిచింది. ఇక రోహిత్ జర్నలిస్టు పాత్రలో నటించాడు. ఆ పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. అతను గతంలో కంటే ఈ సినిమాలో చాలా బొద్దుగా అయితే కనిపించాడు. ఈ పాత్ర వరకు అదే పర్ఫెక్ట్ గా అనిపించింది. ఇక సీఎం బాంబ్ బ్లాస్ట్ తో మొదలయ్యే కథ ఆ తర్వాత జర్నలిస్టు నిజాం గురించి అన్వేషించే విధానం వైపు సాగుతుంది. అనంతరం ఉదయభాను ఎపిసోడ్ అజయ్ ఘోష్ ఇంటర్వ్యూ పార్ట్ సినిమాలో మరింత హైలెట్ గా అయితే నిలిచాయి. 

ఇక ఉప ఎన్నికల తీరు దాని తర్వాత వచ్చే సన్నివేశాలు కూడా బాగున్నాయి. అయితే ఇంటర్వెల్ ముందు అలా నెమ్మదిగా సాగిన ఈ కథ ఆ తర్వాత ఇంటర్వెల్ కు వచ్చే సమయానికి సెకండ్ హాఫ్ పై మరింత ఆసక్తిని కలిగిస్తుంది. ఇక ఆ తర్వాత సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ అంతగా ఎక్కవు. దర్శకుడు కథను రాసుకుని విధానం బాగానే ఉన్నా అక్కడక్కడ కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా పెద్దగా కనెక్ట్ అయ్యేలా లేవు. ముఖ్యంగా హీరో ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పిన విధానం చాలా రొటీన్ గానే ఉంది.

ఇక కమర్షియల్ ఎలిమెంట్స్ లో కొన్ని యాక్షన్స్ సన్నివేశాలను చాలా బాగా డిజైన్ చేశారు. సినిమాలో నటించిన అందరూ కూడా వారి పాత్రలకు తగ్గట్టుగా న్యాయం చేశారు. కొన్ని నెగిటివ్ రోల్స్ హడావుడి మాత్రం కాస్త ఎక్కువ మోతాదులో ఉండడం కొంత మైనస్. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో సంగీత దర్శకుడు మహతి సాగర్ తన వర్క్ తో పర్వాలేదనిపించాడు. కెమెరా పని తనం కూడా ఇందులో హైలెట్ గా అయితే నిలిచింది. మొత్తంగా ప్రతినిధి 2 సినిమా ఒక కొత్త తరహా ఎలిమెంట్స్ తో పరవాలేదు అనిపించే విధంగా ఉంటుంది. 

ప్లస్ పాయింట్స్:
👉నారా రోహిత్ నటన
👉స్టోరీ లైన్
👉ఇంటర్వెల్

మైనస్ పాయింట్స్:
👉సెకండ్ హాఫ్
👉కొన్ని రొటీన్ క్యారెక్టర్స్

రేటింగ్: 2.5/5

Post a Comment

Previous Post Next Post