అల్లు అర్జున్.. 10 కోట్లు ఆఫర్ వచ్చినా టెంప్ట్ అవ్వట్లే..


సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న “పుష్ప 2” సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. బ్లాక్ బస్టర్ హిట్ అయిన "పుష్ప" సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పుష్ప 2 చిత్రీకరణకు సంబంధించిన క్లైమాక్స్ సీన్స్ ప్రస్తుతం షూట్ చేస్తున్నారు. ఇక పుష్ప సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ వైడ్‌గా ప్రాచుర్యం పొందగా, అతని నటనకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును సైతం అందుకున్నాడు.

ఇప్పుడు, పుష్ప 2 కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హిందీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న అల్లుఅర్జున్ బాడీ లాంగ్వేజ్ ఈ సీక్వెల్‌కు మరింత హైప్‌ని తీసుకువచ్చింది. ఇప్పుడిప్పుడే వచ్చిన క్రేజ్‌ను వాణిజ్య సంస్థలు క్యాష్ చేసుకునేందుకు అల్లుఅర్జున్‌తో యాడ్స్ చేయాలని చూస్తున్నారు. అయితే, ఇటీవల టొబాకోకి సంబంధించిన యాడ్‌కు 10 కోట్ల ఆఫర్ వచ్చినా, అల్లు అర్జున్ అంగీకరించలేదు. టుబాకోకి సంబంధించిన యాడ్ కావడంతో అల్లు అర్జున్ దాన్ని నిరాకరించడం విశేషం. గతంలో కూడా ఓ పాన్ మసాలా యాడ్ కు ఇదే రేంజ్ లో ఆఫర్ చేయగా దాన్ని రిజెక్ట్ చేశాడు.

Post a Comment

Previous Post Next Post