మహేష్ - రాజమౌళి.. ఇక టైమ్ దగ్గరపడింది!

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ చేయనున్న విషయం తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రాజెక్ట్ ఇంకా అధికారికంగా స్టార్ట్ కాలేదు కానీ, సినిమా చుట్టూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. మహేష్ బాబు, రాజమౌళి, నిర్మాత కే.ఎల్. నారాయణ ఆ మధ్య హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. 


మహేష్ కొత్త లుక్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అభిమానులను ఆకట్టుకున్నాయి. మహేష్ లాంగ్ హెయిర్, గడ్డం లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ లుక్ సినిమా కోసం మహేష్ పూర్తి మేకోవర్ అవుతున్నట్లు అనిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను ఆగస్టులో మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. రీసెంట్ గా వర్క్ షాప్ కూడా నిర్వహించారు. మహేష్ లుక్‌కు సంబంధించిన నిర్ణయాన్ని త్వరలో తీసుకోనున్నారు. ఇక త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. రాజమౌళి తన సినిమాల్లో హీరోలను కొత్త లుక్ తో చూపించడం సాధారణమే. మహేష్ కోసం కూడా ఫుల్ మేకోవర్ అవసరమని సూచించినట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post