బన్నీ వైసీపీ పోటు.. పుష్ప 2కే ఎసరు పెట్టేలా ఉంది..?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సుదీర్ఘ పోరాటం తర్వాత ఏపీలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు కూడా ఘన విజయం సాధించారు. ఈ విజయోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పవన్ కళ్యాణ్ విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ తదితర మెగా హీరోలు పాల్గొన్నారు.


ఈ వేడుకల్లో మెగా ఫ్యామిలీకి చెందిన చాలా మంది పాల్గొన్నారు. కానీ అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరూ ఈ వేడుకలో పాల్గొనలేదు. అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఈ వేడుకకు హాజరుకాకపోవడం అనేక ప్రశ్నలు రేపుతోంది. సోషల్ మీడియాలో రకరకాల అంచనాలు, కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లు అర్జున్ తన ఫ్రెండ్ శిల్పా రవికిశోర్ చంద్ర రెడ్డి కోసం ప్రచారం చేయడం, వైసీపీ నాయకులతో కలవడం జనసైనికులకి నచ్చలేదు.

అయితే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. పవన్ విజయం సందర్భంగా కూడా ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. అయినప్పటికీ, కీలకమైన ఈ విజయోత్సవ వేడుకలో అల్లు ఫ్యామిలీ గైర్హాజరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి పుష్ప 2 ప్రమోషన్స్ పై ప్రభావం చూపుతుందేమో అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. మెగా ఫ్యామిలీలో ఎవరు ఈ విషయంలో పెద్దగా రియాక్ట్ కాకపోవచ్చు కానీ జనసేన ఫ్యాన్స్ లో కొంతమందిని శాంతిపజేయడం కష్టమే. ఫ్యామిలీలో అందరూ పిఠాపురం వెళుతుంటే ఈ టైమ్ లో ఈయన ఒక్కరు అలా వెళ్లడం ఎందుకనే కామెంట్స్ బలంగా వచ్చాయి.

ఇక పుష్ప 2 ని తాము చూడము అని మరికొందరు అంటున్నారు. సినిమాకు టాక్ బలంగా ఉంటే పరవాలేదు కానీ అటు ఇటుగా ఉంటే నెగిటివ్ టాక్ కు మరింత బలం చేకూర్చే ప్రమాదం ఉంది. అసలే పుష్ప పార్ట్ 1 ఆంద్రప్రదేశ్ లో బ్రేక్ ఈవెన్ కూడా అందుకోలేదు. ఇక ఇప్పుడు జనసేన హడావుడిలో పార్ట్ 2 పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. అప్పటివరకు మరచిపోతే ఒకే. అలాగే బన్నీ కూడా పవన్ కళ్యాణ్ ను కలవడం లేదా తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని సందేశం వచ్చేలా ఏదో ఒకటి చేయాలి. లేదంటే ఓపెనింగ్స్ పై ఎంతో కొంత ప్రభావం ఉండవచ్చు.

Post a Comment

Previous Post Next Post