కల్కి 2898AD - ఈ గండం గట్టెక్కితే చాలు..


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898AD విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ భారీ బడ్జెట్ సినిమా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై రూపొందించారు. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సినిమా నుంచి విడుదల చేసిన బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్ మంచి స్పందన తెచ్చుకుంది. 


అలాగే బుజ్జి పేరుతో డిజైన్ చేసిన అడ్వాన్స్ మోడల్ కార్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో ఉపయోగిస్తున్నారు. జూన్ 10న ట్రైలర్ విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ ట్రైలర్ విడుదల తగిన సమయమా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పొలిటికల్ బజ్ నడుస్తోంది. ప్రజలంతా పొలిటికల్ మూడ్ లో ఉన్నారు. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ వ్యక్తి రామోజీరావు మరణం, ప్రధాని ప్రమాణస్వీకారం, క్యాబినెట్ ప్రకటన వంటి అంశాలు ప్రధానంగా మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం, రాజకీయ అల్లర్లు, వైసీపీ ఆందోళనలు వంటి అంశాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో కల్కి 2898AD ట్రైలర్ విడుదల చేసి ప్రజల దృష్టిని ఆకర్షించడం సాధ్యమవుతుందా అన్నది సందేహంగా ఉంది. ఈ ట్రైలర్ పబ్లిక్ అటెన్షన్ ని గ్రాబ్ చేయడం చాలా ముఖ్యం. ప్రజల దృష్టిని ఆకర్షించకపోతే, సినిమా పట్ల ఆసక్తి తగ్గిపోవచ్చు. కల్కి లాంటి పాన్ వరల్డ్ చిత్రానికి ట్రైలర్ బజ్ చాలా అవసరం. ఒక విధంగా ట్రైలర్ రిలీజ్ టైమింగ్ సినిమాకు గండంగా మారింది. ఇది సవ్యంగా దాటింది అంటే చాలు.. సినిమాకు తిరుగుండదు.

Post a Comment

Previous Post Next Post