కాజల్.. ఇన్నాళ్ళకు బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్


కాజల్ అగర్వాల్.. అందమైన నవ్వుతోనే మాయ చేసి మనసులను గెలుచుకుంది. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన కాజల్, ప్రస్తుతం సినిమాలు, ఫ్యామిలీ లైఫ్ రెండింటినీ సమర్థవంతంగా నిర్వహిస్తోంది. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన కాజల్, చందమామ మూవీతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.

అనేక సినిమాలలో నటించినా, కాజల్ కు అసలైన బ్రేక్ మగధీర మూవీతో వచ్చింది. ఈ బ్లాక్ బస్టర్ హిట్ ఆమె కెరీర్‌ను కొత్త ఎత్తులకు తీసుకెళ్లింది. అప్పటినుంచి, కాజల్ రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ, మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాలు పొందింది. కేవలం తెలుగు సినిమాలలోనే కాకుండా, తమిళం, హిందీ భాషల్లో కూడా కాజల్ తన ప్రతిభను నిరూపించుకుంది.


కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు కాజల్ తన చిన్నప్పటి ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న కాజల్, ఇటీవల మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. గత సంవత్సరం భగవంత్ కేసరి మూవీలో నటించినప్పటికీ, తన పాత్రకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. ప్రస్తుతం, కాజల్ నటించిన రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

సత్యభామ జూన్ 7న విడుదల కాబోతుంది, ఇందులో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. మరో చిత్రం, కమల్ హాసన్‌తో ఇండియన్ 2, జులై 12న విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాలు కాజల్ కెరీర్‌కు మళ్లీ కొత్త హైట్స్ ఇవ్వబోతున్నాయనే నమ్మకంతో ఉన్నారు. మరి, ఈ సినిమాలు కాజల్‌కు ఎలాంటి విజయాలు అందిస్తాయో వేచి చూడాలి.

Post a Comment

Previous Post Next Post