నిఖిల్ సిద్దార్థ్.. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు..

 

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన స్వయంభు మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఇందులో నిఖిల్ ఒక లెజెండరీ యోధుడిగా కనిపించనున్నారు.

విడుదలైన పోస్టర్లు, మేకింగ్ వీడియోలు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాయి. తాజా అప్డేట్ గా ఒక స్పెషల్ పోస్టర్ విడుదల అయింది. ఇందులో నిఖిల్ యుద్ధానికి సిద్ధమవుతున్న పవర్ఫుల్ వారియర్ లా కనిపించాడు. ఈ సినిమా టాప్ సినిమాటోగ్రాఫర్ కేకే. సెంథిల్ కుమార్ పనిచేయడం ప్రత్యేక ఆకర్షణ. బాహుబలి, RRR వంటి సినిమాలకు పని చేసిన సెంథిల్ అనుభవం ఈ సినిమాకు మరింత హెల్ప్ అవుతుందని చెప్పవచ్చు.


ప్రస్తుతం మేకర్స్ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్ కోసం ప్రపంచ స్థాయి టెక్నీషియన్స్ ను రప్పించారు. ఈ యాక్షన్ సీన్ ను 12 రోజుల పాటు దాదాపు 700 మందితో చిత్రీకరిస్తున్నారు. ఈ ఒక్క సీన్ కోసం రూ.8 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ సీన్ సిల్వర్ స్క్రీన్ పై అదిరిపోనుందట. ఒక్క సీన్ కోసం రూ.8 కోట్లు పెట్టి షూట్ చేస్తున్నారంటే, సినిమా మొత్తం బడ్జెట్ ఎంత ఉంటుందోనని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఈ సినిమా నిఖిల్ కెరీర్ లో మరో పాన్ ఇండియా హిట్ గా నిలుస్తుందని భావిస్తున్నారు. నిఖిల్ ఈ మూవీ కోసం కత్తి సాము, గుర్రపు స్వారీ, కర్ర సాము వంటి పలు విద్యలు నేర్చుకున్నారు. ఒకప్పుడు రూ.8 కోట్ల బడ్జెట్ లో సినిమాలు చేసిన నిఖిల్, ఇప్పుడు ఆయన నటిస్తున్న మూవీలో ఒక్క యాక్షన్ సీన్ కు రూ.8 కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటే ఎంత ప్రాముఖ్యత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

Post a Comment

Previous Post Next Post