కల్కి 2898AD: భయపడకు మరో ప్రపంచం వస్తుంది!

ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రాబోతున్న బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898AD సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇక సినిమాకు సంబంధించిన ట్రైలర్ను కొద్దిసేపటి క్రితం విడుదల చేయక ఇప్పటివరకు అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. గతంలో ఎప్పుడూ లేనంత విజువల్ ట్రీట్ గా సినిమా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ బచ్చన్ చాలా పవర్ఫుల్ గా కనిపించబోతున్నారు. మరో కొత్త ప్రపంచం కోసమే జనాలు ఎదురుచూస్తున్న కథగా సినిమా ఉంటున్నట్లు తెలుస్తోంది.


గర్భవతిగా ఉన్న పద్మావతి(దీపికా పదుకొనె)ను ఆయన కాపాడాలని అనుకుంటారు. ఇక భైరవ, అశ్వద్ధామకు మధ్యలో క్లాష్ ఏర్పడడం వంటి అంశాలు సినిమాలో మరింత హైలెట్ కాబోతున్నాయి. విజువల్స్ చూస్తుంటే హాలీవుడ్ కి ఏమాత్రం తీసిపోని విధంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరపైకి తీసుకు వస్తున్నారు అనిపిస్తుంది. వైజయంతి మూవీస్ ఈ సినిమా కోసం 600 కోట్ల వరకు ఖర్చు చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాలో రాజేంద్రప్రసాద్ కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. టాలెంటెడ్ నటీనటులు ఉండడం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. ముఖ్యంగా కమల్ హాసన్ మెకోవర్ కూడా భయంకరంగా ఉంది. బయపడకు మరో ప్రపంచం వస్తుంది అనే డైలాగ్ కూడా హైలెట్ అయ్యింది. సినిమా జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. మరి సినిమా ట్రైలర్ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post