పవన్ గెలుపులో అకిరా కిక్కు.. పర్ఫెక్ట్ టైమింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈసారి జనసేన పార్టీతో 100% సక్సెస్ అందుకోవడం రాజకీయాల్లో పెద్ద సంచలనం అయ్యింది. ఈ విజయంతో పవన్ కళ్యాణ్ తన అభిమానులకు మాత్రమే కాకుండా ప్రత్యర్థులకు కూడా పెద్ద షాక్ ఇచ్చారు. అయితే ఈ విజయం తర్వాత ఆయన పెద్ద కుమారుడు అకిరా నందన్ కూడా ప్రముఖంగా వార్తల్లోకి వచ్చారు. అకిరా నందన్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాడు.


ఆయన తన తండ్రితో ప్రతి సందర్భంలో కనిపించడంతో అభిమానులు అతనిపై ఆసక్తి చూపిస్తున్నారు. అకిరా సోషల్ మీడియాలో బాగా ఆకర్షణీయంగా ఉండడం, తండ్రికి తగ్గట్టుగా కనిపించడం, ఆయనను సినిమాల్లో చూడాలని అభిమానులు కోరుతున్నారు. ఇది అకిరాకు మంచి ఆరంభం అవుతుందని అందరూ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఎన్నికల సమయంలో తన కుమారుని రాజకీయాల్లోకి తీయలేదు.

అకిరా కూడా తండ్రికి సపోర్ట్ చేయాలని అనుకున్నప్పటికీ, పవన్ మాత్రం అతన్ని రాజకీయాలకి దూరంగా ఉంచాడు. ఇప్పుడు పవన్ విజయంతో అకిరా నందన్ మళ్ళీ ఫోకస్ లోకి వచ్చాడు. ఇటీవలే పవన్ కళ్యాణ్ తన కుమారుని చంద్రబాబుతో పరిచయం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే క్రమంలో అకిరా నందన్ ప్రధాని నరేంద్ర మోడీతో కూడా కలవడం జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో అకిరా ఫోటోలు ఒక రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.

ఇది అకిరా నందన్‌కు సరైన ఆరంభం అని చెప్పవచ్చు. తండ్రి విజయంతో అకిరా నందన్ పబ్లిక్ ఫిగర్‌గా మరింత ప్రజాదరణ పొందుతున్నాడు. అకిరా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే మాములుగా ఉండదని చెప్పవచ్చు. అకిరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే ఓకే అని ఇప్పటికే రేణు దేశాయ్ తన అంగీకారాన్ని తెలిపింది. పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చు. రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో అకిరా నందన్ సినిమాల్లోకి రావడం పవన్ అభిమానులకు మంచి కిక్క్ ఇవ్వవచ్చు.

Post a Comment

Previous Post Next Post