ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఐకానిక్ మూవీ ‘పుష్ప 2’ మరో ఆరు రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతోంది. వరల్డ్ వైడ్ గా 12000 స్క్రీన్స్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్యలో రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా అందరి అంచనాలని దాటి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మేకర్స్ కూడా అదే నమ్మకంతో ఉన్నారు. ఇక అల్లు అర్జున్ ఈ సినిమాతో తన మార్కెట్ అమాంతం పెరిగిపోతుందని భావిస్తున్నారు.
‘పుష్ప 2’ మీద ఎవరి హోప్స్ వారికి ఉన్నాయి. బయ్యర్లు కూడా ఈ సినిమాతో మంచి లాభాలు వస్తాయని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ చాలా అగ్రెసివ్ గా సాగుతున్నాయి. అల్లు అర్జున్ తన భుజాలపై వేసుకొని సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. ప్రేక్షకులకి చేరువ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ముంబైలో ‘పుష్ప 2’ ఐకానిక్ ఈవెంట్ జరిగింది.
ఇందులో ‘పుష్ప’ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథని బన్నీ రివీల్ చేశారు. ఈ సినిమాకి పుష్ప టైటిల్ అనుకున్నప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్, డైరెక్టర్ హరీష్ శంకర్ తో చెప్పడం జరిగింది. ‘పుష్ప’ అంటే తెలుగులో ప్లవర్. అందుకే ఆ టైటిల్ చాలా సాఫ్ట్ గా ఉందని అతను అన్నాడు. ఒక మాస్, కమర్షియల్ మూవీకి సరిపోదని, ఇంకేదైనా పవర్ ఫుల్ టైటిల్ పెట్టాలని సూచించాడు.

అదే విషయాన్ని సుకుమార్ తో చెప్పాను. అయితే ‘పుష్ప’ టైటిల్ ని సుకుమార్ గారు నమ్మారు. ఆ టైటిల్ కి బ్యాక్ డ్రాప్ లో మాస్ లుక్ లో పవర్ ఫుల్ గా ఉన్న తన ఇమేజ్ పెడితే డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది. కచ్చితంగా ఆడియన్స్ కి అది కొత్తగా అనిపిస్తుందని చెప్పారు. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఆ రోజు సినిమాకి వచ్చిన హై ఇప్పటి వరకు తగ్గలేదు. అలాగే ఉంది. ఇప్పటికి అదే జోరు కొనసాగుతోందని అల్లు అర్జున్ తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. ‘పుష్ప 2’ పైన నార్త్ లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. నార్త్ లో ఫస్ట్ డే కలెక్షన్స్ తోనే ఈ మూవీ రికార్డ్ సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. మరి ఈ అంచనాలు ఏ మేరకు మూవీ అందుకుంటుంది అనేది వేచి చూడాలి.
Follow
Follow
Post a Comment