సౌత్ సినిమాల్లో రెండు దశాబ్దాలుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న త్రిష, ఇప్పటికీ స్టార్ హీరోల సరసన నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. 1999లో ‘జోడీ’లో చిన్న పాత్రతో తెరంగేట్రం చేసిన త్రిష, 2002లో సూర్య సరసన హీరోయిన్‌గా మలయాళ చిత్రంలో నటించింది. ఆ తర్వాత ‘నీ మనసు నాకు తెలుసు’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తెలుగు, తమిళ పరిశ్రమల్లో తనకంటూ పటిష్టమైన గుర్తింపు తెచ్చుకుంది.
త్రిష కెరీర్‌లో కొన్ని కష్టకాలాలు వచ్చినా, ‘పొన్నియిన్ సెల్వన్’తో తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. విజయ్ సరసన ‘లియో’లో మెరిసి మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏకంగా ఏడు చిత్రాలు ఉండగా, అందులో మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’, కమల్ హాసన్‌తో ‘థగ్ లైఫ్’, మోహన్ లాల్‌తో ‘రామ్’, అజిత్‌తో ‘విదాముయార్చి’ వంటి భారీ చిత్రాలు ఉన్నాయి.
ప్రస్తుతం త్రిష సినిమా కోసం తీసుకునే పారితోషికం కోటి రూపాయల పైమాటేనని సమాచారం. 41 ఏళ్ల వయసులో కూడా ఆమె స్టార్ హీరోలతో నటిస్తూ, భారీ రెమ్యునరేషన్ అందుకోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతవరకు త్రిషతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన చాలామంది బ్యూటీలు సపోర్టింగ్ రోల్స్‌లోకి వెళ్ళిపోయినా, త్రిష మాత్రం తన స్థానాన్ని దృఢంగా నిలబెట్టుకుంటూ స్టార్ హీరోల తొలి ఎంపికగా నిలుస్తోంది.
ఇక ఈ ఏడాది త్రిష నటిస్తున్న చిత్రాలు పెద్ద విజయం సాధిస్తే, మరికొన్ని సంవత్సరాలు ఆమె స్టార్‌డమ్ కొనసాగిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న క్రేజ్‌తో ఆమె కెరీర్ మరింత పీక్స్‌కి చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Follow
Follow
Post a Comment