Subscribe Us

Anchor Pradeep focus is on Pawan Kalyan now!!


టాలీవుడ్ బెస్ట్ యాంకర్స్ లో ఒకరైన ప్రదీప్ మొత్తానికి బాక్సాఫీస్ వద్ద మొదటి హిట్ కొట్టాడు. 30రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమా మూడు రోజుల్లోనే ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసింది. సినిమాకు పాట అందించిన క్రేజ్ తో పాటు చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్ కూడా బాగానే హెల్ప్ అయ్యింది. ఇక ప్రదీప్ కూడా త ఆ పర్సనల్ విషయాలని బయటపెడుతూ మరి సినిమాపై జనాల ఫోకస్ పడేలా చేశాడు.

ఇక ఇటీవల ప్రదీప్ ఫోకస్ పవన్ కళ్యాణ్ పై కూడా ఉన్నట్లు అర్ధమయ్యింది. ప్రదీప్ జీ ఛానెల్ లో కొంచెం టచ్ లో ఉంటే చెబుతా అనే టాక్ షోతో బాగా క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ షోకు దాదాపు అగ్ర హీరోలందరు వచ్చారు. బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ కూడా వచ్చాడు. మహేష్, నాగ్, నాని, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ అందరూ వచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ ను కూడా రప్పించాలని ట్రై చేస్తున్నాడట. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అదే చెప్పాడు ప్రదీప్. తప్పకుండా ఒకరోజు పవన్ కళ్యాణ్ షోకు వస్తారని ముందే ఒకసారి చర్చలు జరిపినట్లు వివరణ ఇచ్చాడు. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి
.


Post a Comment

0 Comments