Puri Jagannath to direct him again!!
Thursday, February 04, 2021
0
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కథ చెప్పాడు అంటే చాలా వరకలకు హీరోలకు చేయాలనే అనిపిస్తుంది. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయనతో సినిమా చేయని స్టార్ హీరో లేడు. దాదాపు మీడియం హిరోలందరితో వర్క్ చేశాడు. వారం రోజుల్లో హై వోల్టేజ్ కథను రేడీ చేయగల ఈ దర్శకుడు ఇటీవల మాస్ రాజా కోసం కూడా అంతే వేగంగా మరో కథను రెడీ చేసినట్లు సమాచారం.
మాస్ రాజా రవితేజ పూరి జగన్నాథ్ కు ఒక ప్రాజెక్ట్ పై కమిట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరి కాంబినేషన్ లో ఇదివరకు 5 సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, నేనింతే, దేవుడు చేసిన మనుషులు వంటి సినిమాలను చేశారు. ఇక 6వ సారి కూడా మరో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ తో రాబోతున్నట్లు టాక్ వస్తోంది. లైగర్ అనంతరం పూరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక రవితేజ ప్రస్తుతం ఖిలాడితో రెడీ అవుతున్న విషయం తెలిసిందే.
Follow @TBO_Updates