ఇది రాజమౌళి వెన్నుపోటు..!


RRR సినిమా ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. రెండు సార్లు రిలీజ్ డేట్స్ ను మార్చుకున్న చిత్ర యూనిట్ ఎట్టకేలకు RRR ను అక్టోబర్ 13న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్న క్రమంలో బాలీవుడ్ సినీ నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్ అభ్యంతరం వ్యక్తం చేయడం చర్చకు దారి తీసింది.

బోణి కపూర్ నిర్మించిన బిగ్ బడ్జెట్ సినిమా మైదాన్ అక్టోబర్ 15న రాబోతున్నట్లు ఎప్పుడో ఎనౌన్స్ చేశారు. అయితే RRR రిలీజ్ డేట్ ప్రకటించిన రోజు నుంచే బోనీ కపూర్ రాజమౌళిపై తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  ముందు మేము ఫిక్స్ చేసుకున్న డేట్ దరిదాపుల్లోకి ఎలా వస్తారని ప్రతిసారి బోనీ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా మరో మెట్టు ఎక్కి రాజమౌళిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది వెన్నుపోటు చర్య కాక మరేమవుతోంది. వందలాది మంది జీవితాలతో ఆడుకుంటున్నారు.. అంటూ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బోనీ కపూర్. ఇక ఇంతవరకు RRR టీమ్ అయితే ఈ వివాదంపై అఫీషియల్ గా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇక బోనీ కపూర్ మాత్రం పట్టు విడువని విక్రమార్కుడిలా RRR డేట్ ను మర్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు.Post a Comment

Previous Post Next Post