ఉప్పెన.. సేతుపతి క్లిక్కవ్వాడనికి సింపుల్ రీజన్ ఇదే!!


మొత్తానికి ఉప్పెన ట్రైలర్ అనుకున్నదనికంటే ఎక్కువ బజ్ క్రియేట్ చేసింది. పాటలతోనే సినిమాను దేవి శ్రీ ప్రసాద్ ఒక లెవెల్లో నిలబెట్టాడు. ఇక ట్రైలర్ లో విజయ్ సేతుపతి క్యారెక్టర్ తో మరో స్థాయికి చేరుకుంది. ఒక్కసారిగా ఉప్పెనలా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. విజయ్ సేతుపతి క్యారెక్టర్ ను దర్శకుడు బుచ్చిబాబు పర్ఫెక్ట్ గా వాడుకున్నట్లు అర్ధమవుతోంది.

విజయ్ సేతుపతి నటన గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే అతని పాత్రకు అరుంధతి రవి శంకర్ చెప్పిన డబ్బింగ్ నెవర్ బిఫోర్ అనేలా ఉంది. సైరా సినిమాలో సేతుపతి పాత్రకు ఇచ్చిన డబ్బింగ్ అంతగా క్లిక్కవ్వలేదు. మాస్టర్ సినిమాలో కూడా డబ్బింగ్ రవి శంకర్ లాంటి వాళ్ళు చెప్పి ఉంటే మరో లెవెల్లో ఉండేది. ఇక మరో ఛాన్స్ తీసుకోకుండా బుచ్చిబాబు పట్టుబట్టి రవిశంకర్ చేత డబ్బింగ్ చెప్పించాడట. సుకుమార్ కూడా రషెస్ చూసి పర్ఫెక్ట్ అని పాజిటివ్ కామెంట్స్ చేశాడని తెలుస్తోంది. మరి ఈ నెల 12న రానున్న సినిమా ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post