హీరోగా నిహారిక భర్త.. అసలు క్లారిటీ వచ్చేసింది!!


మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఇటీవల వైష్ణవ్ తేజ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వైష్ణవ్ అనంతరం ఆ ఫ్యామిలీ నుంచి నెక్స్ట్ హీరోగా ఎవరు ఎంట్రీ ఇస్తారనే దానిపై గత కొంత కాలంగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా నిహారిక భర్త చైతన్య జొన్నల గడ్డ కూడా హీరోగా అడుగులు వేసున్నట్లు  రూమర్స్ రాగా ఫైనల్ గా ఆ విషయాలపై ఒక క్లారిటీ ఇచ్చేసింది మెగా డాటర్ నిహారిక. 

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక తన భర్తకు సినిమాలు చూడటమే తప్ప నటించడం ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. నటన అనేది చిన్నప్పటి నుంచి ఎంతో కొంత ఆసక్తి ఫ్యాషన్ ఉండాలని ఎదో సడన్ గా ఇప్పటికపుడే హీరోగా అనుకుంటే సరిపోదని కుండ బద్దలు కొట్టేసింది.  మొత్తానికి నిహారిక క్లారిటీ ఇవ్వడంతో రూమర్స్ కు కౌంటర్ ఇచ్చినట్లయ్యింది. ఇక మెగా ఫ్యామిలీలో నెక్స్ట్ హీరోగా వచ్చేది పవన్ తనయుడు అకిరా నందన్ అని మరోక రూమర్ అయితే స్ట్రాంగ్ గా వినిపిస్తోంది.Post a Comment

Previous Post Next Post