శంకర్ ఇండియన్ 2 పనైపోయినట్లేనా ?


ఇండియన్ ఆల్ టైమ్ బెస్ట్ దర్శకుల్లో ఒకరైన శంకర్ సినిమా అంటే అభిమానుల్లో అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఒక కొత్త పాయింట్ తో పాటు మంచి సందేశాన్ని అందిస్తారు. కమర్షియల్ యాంగిల్ లో ప్రతి మంచి విషయాన్ని అర్ధమయ్యేలా చెబుతుంటారు. అయితే మొదటిసారి శంకర్ సినిమా షూటింగ్ దశలోనే ఆగిపోయిందని రూమర్స్ వస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. 

శంకర్ కమల్ హాసన్ తో ఇండియన్ 2 అనే సినిమాను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాను ఏ ముహూర్తన స్టార్ట్ చేశారో గాని ప్రతిసారి ఎదో ఆటంకం ఎదుర్కొంది. షూటింగ్ స్టార్టింగ్ దశలోనే బడ్జెట్ పై అభ్యంతరాలు, ఆ తరువాత యాక్సిడెంట్ లో యూనిట్ సభ్యులు మరణించడం, అలాగే కరోనా కూడా దెబ్బె వేయడం వలన చాలా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు శంకర్ రామ్ చరణ్ తో సినిమాను సెట్ చేసుకోవడం, అలాగే కెమెరెమెన్ రత్నవేలు సూర్య సినిమాను స్టార్ట్ చేయడంతో ఇండియన్ 2 అటకెక్కినట్లే అనే టాక్ వస్తోంది. మరి ఈ రూమర్స్ పై శంకర్ ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.Post a Comment

Previous Post Next Post