ప్రభాస్ VS వరుణ్ తేజ్.. ఇద్దరు తగ్గట్లేదు!


టాలీవుడ్ ఇండస్ట్రీలో మొత్తానికి బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులును బ్రేక్ చేసే విధంగా సినిమాలు రాబోతున్నట్లు ఒక క్లారిటీ వచ్చేసింది. క్రాక్, మాస్టర్, రెడ్ సినిమాలతో పాటు ఒక్కసారిగా ఉప్పెన మూవీ మరింత ఉపునిచ్చింది. ఇక రానున్న రోజుల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు రాబోతున్నట్లు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక బాక్సాఫీస్ వద్ద కొన్ని యుద్ధాలు కూడా జరగబోతున్నాయి.

వరుణ్ తేజ్ గని సినిమాతో పాటు ప్రభాస్ రాదేశ్యామ్ సినిమా జూలై 30న రాబోతున్న విషయం తెలిసిందే. ఎవరో ఒకరు రిలీజ్ విషయంలో తగ్గుతారని అనుకుంటే ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. రీసెంట్ గా నాని టక్ జగదీష్, నాగ చైతన్య లవ్ స్టొరీ సినిమాలు క్లాష్ అవుతుండగా నాని పోటీ నుంచి తప్పుకున్నాడు. ఇక బాలయ్య సినిమా ఉందని రవితేజ కూడా తన ఖిలాడి డేట్ ను మార్చుకున్నాడు. ఇక ప్రభాస్, వరుణ్ ఇద్దరిలో వరుణ్ తగ్గే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తున్నప్పటికీ. ఇంకా నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. మరి ప్రభాస్ టీమ్ ఈ ఫైట్ పై ఏమైనా చర్చలు జరుపుతుందో లేదో చూడాలి.Post a Comment

Previous Post Next Post