పవన్ సినిమా కోసం 'చార్మినార్'!!


టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హైప్ క్రియేట్ చేస్తున్న కాంబినేషన్ లలో క్రిష్-పవన్ సినిమా ఒకటి. ఈ సినిమాకు సంబంధించిన చిన్న న్యూస్ లీకైనా కూడా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అవుతోంది. సినిమా హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. దర్శకుడు క్రిష్ ఆడియెన్స్ ను 17వ శతాబ్దంలోకి తీసుకు వెళతాడాని అనిపిస్తోంది.

సినిమా కోసం భారీ ఖర్చుతో చార్మినార్ సెట్ ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. మూడు వందల ఏళ్ళ క్రితం చార్మినార్ ఎలా ఉండేది అప్పుడు భాగ్యనగరం రూపురేఖలు కూడా ఎలా ఉన్నాయనే వాతావరణాన్ని సినిమాలో చూపిస్తారని తెలుస్తోంది. దర్శకుడు క్రిష్ మేకింగ్ ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దీంతో సినిమాపై అంచనాలు ఎక్కువవుతున్నాయి. ఇక సినిమాకు హరిహర వీరమల్లు అనే టైటిల్ ను అనుకున్నట్లు రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు.


Post a Comment

Previous Post Next Post