హై వోల్టేజ్ మల్టీస్టారర్ కోసం వివి.వినాయక్


టాలీవుడ్ సీనియర్ దర్శకుల్లో ఒకరైన వివి.వినాయక్ గతంలో హీరోగా సినిమా చేయడానికి సిద్దమైన విషయం తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్ హౌజ్ లో శీనయ్య అనే ఆ సినిమా కోసం వినాయక్  కొన్ని వర్కౌట్స్ కూడా చేసి మొత్తం తన లుక్కునే మార్చేశాడు.  ఆ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే అనుకోకుండా ఆ సినిమా ఆగిపోవడంతో వినాయక్ పడిన కష్టమంతా వృధా అయ్యింది. మళ్లీ ఆయన మొహానికి రంగు వేయలేదు. 

ఇక చాలా కాలం తరువాత వినాయక్ కు ఒ మంచి అఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ , రానా కలిసి నటిస్తున్న అయ్యప్పనుమ్ కోశియుమ్ సినిమాలో వినాయక్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. మరి ఆ సినిమాతో అయినా వినాయక్ నటుడిగా కంటిన్యూ అవుతారో లేదో చూడాలి. ఇక ఈ సీనియర్ దర్శకుడు ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్ తో హిట్ కొట్టడానికి ప్లాన్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.Post a Comment

Previous Post Next Post