వీలైతే ఆ బ్యానర్ లోనే అన్ని సినిమాలు: సుకుమార్


దర్శకుడు సుకుమార్ తో సినిమా చేయాలని హీరోలు ఎలా ఆలోచిస్తారో నిర్మాతలు కూడా అదే తరహాలో ఎదురుచూస్తుంటారు. లేటయినా పరవాలేదు అని కమిట్మెంట్ తీసుకోవడంలో ముందుటారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్స్ కూడా మామూలుగా లేవు. సుకుమార్ ను వాళ్ళు ఇప్పట్లో వదిలేలా లేరని అనిపిస్తోంది. 

పుష్ప సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత కూడా విజయ్ దేవరకొండతో చేయబోయే సినిమాను హై బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సుకుమార్ ఒక మాట కూడా అనేశారు. కుదిరితే వీలైనన్ని సినిమాలు మైత్రి మూవీ మేకర్స్ తోనే చేస్తానని చెప్పేశాడు. అంటే వాళ్ళు ఏ రేంజ్ లో కనెక్ట్ అయ్యారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చూడాలి మరి భవిష్యత్తులో ఈ కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వస్తాయో. ఇక సుకుమార్ శిష్యుడు ఉప్పెన తరువాత మైత్రి బ్యానర్ లోనే మరో సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇచ్చాడు.Post a Comment

Previous Post Next Post