Will Uppena has Potential to Collect 100Cr ??
Thursday, February 11, 2021
0
శుక్రవారం విడుదలకు సిద్దమైన ఉప్పెన సినిమా ఏ రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. సినిమా ఓపెనింగ్స్ తోనే రికార్డ్ క్రియేట్ చేసేలా ఉందని టాక్ అయితే వస్తోంది. ఆ సంగతి అటుంచితే సినిమా మొత్తంగా ఏ స్థాయిలో లాభాలు అందుకుంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూల్లో దర్శకుడు సుకుమార్ కలెక్షన్స్ పై తన వివరణ ఇచ్చారు. ఉప్పెన కథ విన్న రోజే ఇది 100కోట్ల సినిమా అని చెప్పేశానని తప్పకుండా సినిమా 100కోట్లు కాకపోయినా 90కోట్ల వరకు సాధిస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు. దీంతో సినిమాపై సుకుమార్ కు ఉన్న కాన్ఫిడెన్స్ ఏమిటో ఈజీగా అర్థమవుతుంది. ఆయన శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమా ద్వారా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. మరి సినిమా ఈ హీరోకు ఎలాంటి బూస్ట్ ఇస్తుందో చూడాలి.
Follow @TBO_Updates
Tags