ఇండియన్ క్రికెట్ టీమ్ లో ప్రస్తుతం కీలక బౌలర్ గా ఎదుగుతున్నాడు నటరాజన్. తమిళనాడులోని ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఈ కుర్రాడికి నాలుగేళ్లకు ముందు రంజి ట్రోపి అంటే కూడా పెద్దగా అవగాహన లేదు..అలాంటిది అతి తక్కువ సమయంలోనే ప్రపంచ దిగ్గజ బ్యాట్ మెన్ లను తన యార్కర్స్ తో బయపెట్టాడు. టెన్నిస్ బాల్ తో మొదలైన అతని ప్రయాణం చాలా వేగంగా ఐపీఎల్ వరకు వచ్చేసింది. అయితే ఇటీవల ఆస్ట్రేలియా టూర్ లో అద్భుతమైన ప్రదర్శనను కనబరచడంతో తమిళనాడు జనాలు అతన్ని ఎంతగానో అభిమానిస్తున్నారు. అయితే అతని బయోపిక్ తీయడానికి కొంతమంది దర్శకులు రచయిలు ఇటీవల సంప్రదించారట. అయితే తాను సాధించాల్సింది ఇంకా చాలా ఉందని అప్పుడే బయోపిక్ అవసరం లేదని రిజెక్ట్ చేసినట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు నటరాజన్.
0 Comments