పెళ్లికి సిద్దమైన యువ హీరో.. అమ్మాయి ఎవరో తెలుసా?


టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో హీరో పెళ్లి కొడుకు కాబోతున్నాడు. లాల్ డౌన్ లో కొంతమంది సెలబ్రెటీలు వరుసగా పెళ్లిళ్లతో సర్ ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో యువ నటుడు కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అతను మరెవరో కాదు సీనియర్ నిర్మాత ఎమ్ఎస్.రాజు తనయుడు సమంత అశ్విన్. రాజు గారు ఒక్కడు, వర్షం వంటి ఎన్నో బాక్సాఫీస్ హిట్ సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే.

ఇక ఆయన తనయుడు సుమంత్ అశ్విన్ కోసం కుటుంబ సభ్యుల అమ్మాయినే సెలెక్ట్ చేశారు. ఆమె పేరు దీపిక. యుఎస్ లో ఇటీవల ఎమ్మెస్ పూర్తి చేసుకుందట. ఇక ఈ నెల 13న వీరి వివాహం ఒక స్టార్ హోటల్ లో ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక తునిగా తునిగా సినిమాతో వెండితెరకు పరిచయమైన సుమంత్ అశ్విన్ హీరోగా ఇంకా అనుకున్నంత స్థాయికి రాలేదు. అపజయాలు ఎన్ని వస్తున్నా కూడా తనదైన శైలిలో ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు.


Post a Comment

Previous Post Next Post