టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక రూమర్ హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సడన్ గా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు టాక్ వస్తోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా మరో దర్శకుడిని లైన్ లో పెట్టినట్లు సమాచారం. తారక్ 30వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాలని అనుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
రేపో మాపో స్టార్ట్ అవుతుందని అనుకుంటున్న సమయంలో సడన్ గా త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వస్తోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివను రంగంలోకి దింపినట్లు సమాచారం. ఇద్దరి మధ్య ఏదో జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై ఏప్రిల్ 13న క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందట. త్రివిక్రమ్ తన న్యూ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఒక విషయాన్ని చెప్పబోతున్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment