Venkatesh Dhrushyam2 release date fixed?


ప్రస్తుతం వేగంగా సినిమాలు చేస్తున్న సీనియర్ హీరోలలో వెంకటేష్ ఒకరు. ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఎక్కువగా ఎట్రాక్ట్ చేసే వెంకటేష్ ప్రస్తుతం F3 సినిమాతో పాటు దృశ్యం 2 షూటింగ్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలకంటే ముందు నారప్ప సినిమాతో సందడి చేయబోతున్నాడు.

శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన నారప్ప మే 14న రాబోతున్న విషయం తెలిసిందే. ఆ డేట్ మరే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తున్నప్పటికీ ఇంకా అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక F3 సినిమాను ఆగస్ట్ 27న విడుదల చేయనున్నారు. అయితే అంతకంటే ముందే దృశ్యం 2 జెట్ స్పీడ్ లో రాబోతోంది. జూన్ 20న రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. త్వరలోనే అఫీషియల్ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇవ్వనున్నట్లు టాక్ వస్తోంది.


Post a Comment

Previous Post Next Post