ప్రభాస్ మరో బిగ్ బడ్జెట్ మూవీ.. ముంబైలో చర్చలు!!


టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 20వ సినిమాగా రాధేశ్యామ్ విడుదలకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఇక KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో 21వ సినిమా సలార్ సెట్స్ పై ఉండగా బాలీవుడ్ ఓం రావ్ దర్శకత్వంలో ఆదిపురుష్ 22వ సినిమాగా రానుంది. 

ఆ తరువాత నాగ్ అశ్విన్ దర్సకత్వంలో సైన్స్ ఫిక్షన్ సినిమా రెడీ కానుంది. ఇక త్వరలో 24వ సినిమాపై కూడా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ వార్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న సిద్దార్థ్ ఆనంద్ ఇదివరకే కొన్నిసార్లు ప్రభాస్ ను కలిశారు. ఇక ఇటీవలే ముంబైలో యాక్షన్ కథను వినిపించగా ప్రభాస్ పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం. మరోసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. ఒకవేళ సెట్టయితే మైత్రి మూవీ మేకర్స్ ఆ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మించనున్నారు.


Post a Comment

Previous Post Next Post