Uppena combo to repeat again?


టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ కాంబోకు వచ్చే క్రేజ్ మాములుగా ఉండదు. సరైన కథతో వస్తే ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని నిర్మాతల్లో ఒక నమ్మకం ఉంటుంది. ఇక ఉప్పెన నిర్మాతలు కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఉప్పెన సినిమాను అనుకున్న బడ్జెట్ కంటే చాలా కాస్ట్లీగానే నిర్మించింది. 

డైరెక్టర్ బుచ్చిబాబుకు ఎంతగానో సపోర్ట్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ హీరో వైష్ణవ్ తేజ్ కు అలాగే హీరోయిన్ కృతి శెట్టికి కూడా గుర్తిండిపోయేలా మంచి విజయాన్ని ఇచ్చింది. ఇక మరో డిఫరెంట్ లవ్ స్టోరీతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు ఆ జంటను తీసుకురావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక కొత్త దర్శకుడు చెప్పిన కథ విన్న మైత్రి మూవీ మేకర్స్ ఆ కథ ఉప్పెన జోడికి కరెక్ట్ గా సెట్టవుతుందని ఫిక్స్ అయ్యారట. మరి రెండవసారి ఈ జంట సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి.


Post a Comment

Previous Post Next Post