కలర్స్ స్వాతి రీ ఎంట్రీ మూవీ డీటైల్స్..!!


పేరు స్వాతి రెడ్డి అయినప్పటికీ కలర్స్ స్వాతిగానే ఆడియెన్స్ కు ఎక్కువగా పరిచయమైన ఈ నటి గురించి అందరికి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు లేరని అనుకుంటున్న సమయంలో హీరోయిన్ గా సరికొత్తగా ఎంట్రీ ఇచ్చిన స్వాతి  కొన్నాళ్లకు మాయమయ్యింది. మొదట మా టీవీలో వచ్చిన కలర్స్ ప్రోగ్రామ్ ద్వారా తెలుగు వారికి బాగా కనెక్ట్ అయ్యింది.

టీవీ నుంచి సినిమా ఫీల్డ్ కు వచ్చేసిన స్వాతి ఆ తరువాత డేంజర్ సినిమాతో నటిగా మంచి క్రేజ్ అందుకుంది. అనంతరం స్వామిరారా , కార్తికేయ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించి తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. ఇక మ్యారేజ్ సెట్టవ్వడంతో భర్తతో కలిసి విదేశాలకు వెళ్లిన ఈ బ్యూటీ మళ్ళీ ఇన్నాళ్లకు ఒక కొత్త సినిమాతో రీ ఎంట్రీకి సిద్ధమయ్యింది. హర్ష పులిపాక అనే యువ దర్శకుడు తెరకెక్కించబోయే పంచతంత్రం అనే సినిమాలో నటించబోతోంది. ఈ సినిమాలో సముద్రఖని, బ్రహ్మానందం వంటి అగ్ర నటీనటులు కూడా నటిస్తున్నారు.


Post a Comment

Previous Post Next Post