నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా మొత్తానికి ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో గట్టి హిట్టు కొట్టేసింది. నిజానికి ఇది మామూలు హిట్టు కాదు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక తెలుగు సినిమా భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది. సౌత్ ఇండియా మొత్తంలో 48 గంటల్లో ఏ సినిమా కూడా అన్ని వ్యూవ్స్ అందుకోలేదట.
అసలైతే మొదట్లో సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలోనే విడుదల చేయాలని అనుకున్నారు. 24కోట్లకు పైగా ఆఫర్ కూడా వచ్చినట్లు టాక్ వచ్చింది. కానీ క్రాక్, ఉప్పెన హిట్స్ అవ్వడంతో థియేటర్స్ లో సొంతంగానే రిలీజ్ చేసుకున్నారు. కానీ సినిమా దాదాపు 4కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది. ఇక థియేట్రికల్ విడుదల తరువాత నెట్ ఫ్లిక్స్ ముందు అనుకున్న 24కోట్ల డీల్ ను సగానికి పైగా తగ్గించేసింది. ఓటీటీ కంటెంట్ కు ఈ కాన్సెప్ట్ సెట్టవుతుందని తెలుగు జనాలు థియేటర్స్ వరకు రారని నెట్ ఫ్లిక్స్ వాళ్ళు ముందే సలహా ఇచ్చారట. అయినప్పటికీ వైల్డ్ డాగ్ నిర్మాతలు ఆశతో థియేటర్స్ లో విడుదల చేసి అక్కడ 3 కోట్ల నష్టాన్ని చూడటమే కాకుండా ఓటీటీ డీల్ లో దాదాపు 10కోట్ల వరకు లాస్ అవ్వాల్సి వచ్చింది.
Follow @TBO_Updates
Post a Comment