సిద్ శ్రీరామ్ అసలు రెమ్యునరేషన్ ఇదే: ఆర్పీ పట్నాయక్


ఈ రోజుల్లో ఒక సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవ్వాలి అంటే ముందుగా ఒక్క పాటైనా కూడా యూ ట్యూబ్ లో వండర్ క్రియేట్ చేయాల్సిందే. ఎన్ని మిలియన్ల వ్యూవ్స్ వచ్చాయి అనే దానిపైనే సినిమా బజ్ పెరుగుతుంది. ఇక పాట హిట్టవ్వాలి అంటే మొదట సిద్ శ్రీరామ్ లాంటి టాలెంటేడ్ సింగర్స్ ను సెలెక్ట్ చేసుకుంటున్నారు.

దాదాపు సిద్ శ్రీరామ్ పాడిన ప్రతి ఒక్క పాట కూడా ఈజీగా మిలియన్ల వ్యూవ్స్ అందుకుంటుంది. ట్యూన్ క్లిక్కయితే సినిమాకు ఈజీగా బజ్ పెరిగినట్లే. ఇక అతను తీసుకునే రెమ్యునరేషన్ పై కూడా ప్రస్తుతం అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఫైనల్ గా దర్శకుడు ఆర్పీ.పట్నాయక్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వాటిపై క్లియర్ గా వివరణ ఇచ్చారు.  ఒక్కో పాటకు మొన్నటి వరకు 4లక్షలు ఛార్జ్ చేసిన సిద్ శ్రీరామ్ ప్రస్తుతం 4.50లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు క్లారిటీగా వివరణ ఇచ్చారు. అతనికి క్రేజ్ ఉన్నప్పుడు ఆ రేంజ్ లో డిమాండ్ చేయడంలో తప్పు లేదని, అయితే అతను ముందు మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన ట్యూన్ నచ్చితేనే పాడటానికి ఒప్పుకుంటాడాని అన్నారు.


Post a Comment

Previous Post Next Post