Subscribe Us

RamCharan another movie before Shankar Project?


రామ్ చరణ్ మరియు శంకర్ కాంబో ప్రకటించిన తరువాత మెగా అభిమానులు ఎంతగానో సంతోషించారు. అయితే ఈ సంవత్సరం జూన్ నుండి ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుందని అనుకున్న సమయంలో లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి శంకర్ ను అడ్డుకున్న విషయం తెలిసిందే.
దీంతో ఇండియన్ 2 యొక్క పెండింగ్ షూటింగ్ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. శంకర్ కూడా ఇండియన్ 2 షూట్ ను త్వరగా పూర్తి చేస్తానని ప్రకటించాడు. 

కానీ ప్రస్తుతం శంకర్ మరియు లైకా ప్రొడక్షన్స్ మధ్య పరిస్థితులు అనుకూలించడం లేదు. బడ్జెట్ విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. వారు కేటాయించిన బడ్జెట్ శంకర్ కు సరిపోదట. అంతే కాకుండా విదేశాల నుంచి ఇండియన్ 2 కోసం కొంతమంది టెక్నీషియన కూడా రావాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో వారు వచ్చే అవకాశం లేదు. ఇక దీంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కానుంది. అందుకే రామ్ చరణ్ శంకర్ సినిమా కంటే ముందే మరొక సినిమా స్టార్ట్ చేయవచ్చని తెలుస్తోంది.


Post a Comment

0 Comments