Vakeel Saab @ Review


టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది విడుదలవుతున్న బిగ్గెస్ట్ మూవీ వకీల్ సాబ్. పైగా మూడేళ్ళ తరువాత వస్తున్న పవర్ స్టార్ సినిమా కాబట్టి తప్పకుండా సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో చెప్పవచ్చు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పింక్ సినిమాకు రీమేక్ గా వచ్చిన విషయం తెలిసిందే. వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో తెలుసుకుందాం..

కథ:
సత్య దేవ్ (పవన్ కళ్యాణ్) సామాజిక బాధ్యత కలిగిన పౌరుడు.   నిరుపేదలకు సహాయం చేయడానికి న్యాయవాదిగా మారతాడు. ఇక అందరు అతన్ని వకీల్ సాబ్ అని పిలుస్తుంటారు.  అతను శ్రుతి హసన్ ను ప్రేమ వివాహం చేసుకుంటాడు. అయితే దురదృష్టకర సంఘటనల తరువాత, అతను తన వృత్తిని విడిచిపెడతాడు.  కొన్ని సంవత్సరాల తరువాత, అతను అంజలి, అనన్య నాగల్లా మరియు నివేతా థామస్ లను కలుస్తాడు, వీరు గూండాల ముఠాతో వేధింపులకు గురవుతుంటారు. ఎలాగైనా వారికి సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు.  ముగ్గురు మహిళలకు న్యాయం జరిగేలా చూడాలంటే అతను డిఫెన్స్ న్యాయవాది ప్రకాష్ రాజ్ ను అలాగే ఒక బలమైన రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా పోరాడాలి. మరి వకీల్ సాబ్ ఆ ముగ్గురికి అమ్మాయిలకు న్యాయం చేయగలడా? అసలు ఆ అమ్మాయిలకు జరిగిన అన్యాయం ఏంటి? అనేది వెండితెరపై చూడాలి
ఫస్ట్ హాఫ్:
మొదటి 15నిమిషాల్లోనే దర్శకుడు వేణు శ్రీరామ్ కథ అసలు పాయింట్ ను మొదలు పెట్టాడు. వాళ్ళు ఎలా ట్రాప్ అవుతారు. జరిగిన అన్యాయం ఏంటి అనేది సస్పెన్స్ లో ఉంచి ఆడియెన్స్ ను కథలోకి లాగేసాడు. ఇక 15 నిమిషాల తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉంటుంది. అప్పటికే న్యాయ వృత్తికి దూరంగా ఉన్న సత్య దేవ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీని ఆ ముగ్గురు అమ్మాయిలు తెలుసుకుంటారు. శృతి హాసన్ కి సంబంధించిన సీన్స్ కూడా వస్తుంటాయి. అసలు సత్యదేవ్ వృత్తిని వదిలిపెట్టి ఎందుకు అనుకోని విధంగా మారిపోతాడు అనేది కొంత ఆసక్తిని కలిగిస్తుంది. ఇక అమ్మాయిలకు న్యాయం చేయడం కోసం రంగంలోకి దిగే పవర్ స్టార్ ప్రీ ఇంటర్వెల్ ఫైట్ తో ఒక్కసారిగా హై వోల్టేజ్ డ్రామా క్రియేట్ చేస్తాడు. ఇక MP దగ్గరికి వెళ్లి వార్నింగ్ ఇచ్చే సీన్స్ అభిమానుల చేత విజిల్స్ వేయించాయి. ఆ సీన్స్ తో మళ్ళీ పాత పవర్ స్టార్ ను కొత్తగా చూసినట్లు అనిపిస్తుంది.  

సెకండ్ హాఫ్:
సెకండ్ హాఫ్ ను దర్శకుడు మరో లెవెల్లో ప్రజెంట్ చేశాడనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ కొంత స్లోగా నడిచినా సెకండ్ హాఫ్ మాత్రం పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్స్ తో అద్భుతంగా ఆకట్టుకున్నాడు. సెకండ్ హాఫ్ దాదాపు కోర్టు సన్నివేశాలతోనే నడుస్తుంది. ఇక పవన్ ను ఎంత హైలెట్ చేసినా కూడా అసలు కథను ఎక్కడా కూడా మిస్ చేయలేదు. కోర్టు సీన్స్ లో డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. ప్రకాష్ రాజ్ పెర్ఫామెన్స్ కు తగ్గట్లు పవన్ టైమింగ్ యాక్టింగ్ పర్ఫెక్ట్ గా సెట్టయ్యింది. సినిమాలో ట్విస్ట్ ఎలిమెంట్స్ అందరికి తెలిసినప్పటికీ దర్శకుడు తనదైన శైలిలో కొంత డిఫరెంట్ గా ప్రజెంట్ చేశాడు. సెకండ్ హాఫ్ మొత్తం పవన్ వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. అయితే కొన్ని చోట్ల కమర్షియల్ పాయింట్స్ కథకు అడ్డం పడుతున్నట్లు అనిపిస్తుంది గాని ఆ సీన్స్ పవన్ ఫ్యాన్స్ కు బాగా కనెక్ట్ అవుతాయి.

ఫైనల్ గా:
సినిమాలో సాంగ్స్ ముందే హిట్టయ్యాయి. ఇక థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది. పవర్ స్టార్ ఎలివేషన్స్ కు మ్యూజిక్ గట్టిగానే బాధారు. ఇక ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బావుంది. సినిమా ఎక్కువ భాగం కోర్టు సీన్స్ తోనే నడుస్తుంది. అమ్మాయిల హక్కులు వారి మనో భావాలకు సంబంధించిన విషయాలను చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ పెర్ఫామెన్స్ తో అద్భుతంగా ఆకట్టుకున్నాడు. కొన్ని డైలాగ్స్ ఆయన పర్సనల్ పాలిటిక్స్ కు దగ్గరగా ఉంటాయి. సినిమాలో డైలాగ్స్ రైటర్ కు నిజంగా సక్సెస్ లో సగం మార్కులు వేయాల్సిందే. దానికి తోడు నటీనటుల టైమింగ్ అమితంగా ఆకట్టుకుంటుంది. ఇక అంజలి నివేద థామస్ నటన కూడా కథకు బలాన్ని ఇచ్చాయి. కోర్టు సీన్స్ ను కమర్షియల్ గా చెప్పడం ఓ వర్గం వారికి అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. ఇక సినిమాలో ఎలాంటి గెస్ట్ రోల్స్ లేవు. ఫైనల్ గా సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విజిల్స్ వేసేలా ఉంటుంది. ఇక మిగతా వాళ్ళు పెద్దగా అంచనాలు లేకుండా ఒకసారి చూడవచ్చు.

ప్లస్ పాయింట్స్
పవన్ కళ్యాణ్ నటన
డైలాగ్స్
థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
ఇంటర్వల్ సీన్
సెకండ్ హాఫ్ ఎలివేషన్ సీన్స్ 

మైనెస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్ స్లోగా ఉండడం
క్కొన్ని సీన్స్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఫోర్స్ ఫుల్ గా అడ్ చెయ్యటం

బాటమ్ లైన్.. 'వకీల్ సాబ్' వన్ మ్యాన్ షో

రేటింగ్: 3/5  

Post a Comment

Previous Post Next Post