Buzz: ఆర్మీ ఆఫీసర్ గా ప్రభాస్!!


టాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ హీరోగా ప్రభాస్ తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. సాహో అంతగా హిట్టవ్వకపోయినప్పటికి డార్లింగ్ తో మరిన్ని మాస్ అండ్ యాక్షన్ సినిమాలు చేస్తే బాహుబలి కంటే హై రేంజ్ లో హిట్టు కొట్టవచ్చని అందరికి అర్ధమయ్యింది.

మిస్టర్ పర్ఫెక్ట్ ఎలాంటి సినిమా చేసినా కూడా పాన్ ఇండియా అని ప్రేక్షకులకు ముందే ఒక క్లారిటీ వచ్చేస్తోంది. ఇక ప్రభాస్ ను ఆర్మీ ఆఫీసర్ గా చూస్తే ఆ కిక్కు మాములుగా ఉండదు. సలార్ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే అందులో ఒక ఆర్మీ ఆఫీసర్ గా కూడా కనిపిస్తాడట. ప్రభాస్ కటౌట్ కు ఆర్మీ డ్రెస్ పడితే మాములుగా ఉండదు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సమ్మర్ కు ప్రేక్షకుల ముందుకు రానుంది.


Post a Comment

Previous Post Next Post