మహేష్ తరువాత రాజమౌళి మళ్ళీ ఆ హీరోతోనే..?


టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయిని అమాంతంగా ప్రపంచ బాక్సాఫీస్ ముందు నిలబెట్టిన చిత్రం బాహుబలి. దర్శకధీరుడు రాజమౌళి - రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఆ సినిమా పాన్ ఇండియా దారిని మరింత విస్తృతం చేసింది. ఆ సినిమా తరువాత అనేక సినిమాలు ఆ బాటలోనే వెలుతున్నాయి. ఇక మరోసారి ఆ దారిని మరింత పెద్దది చేసేందుకు జక్కన్న - ప్రభాస్ కాంబో మళ్ళీ కలవనున్నట్లు టాక్ వస్తోంది. 

మహేష్ బాబు సినిమా అనంతరం రాజమౌళి మళ్ళీ ప్రభాస్ తో మరో సినిమా చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా అందరూ దర్శకులు ఎంతకైనా మంచిది అని మరొక కథను సెట్ చేసుకుంటున్నారు. ఇక రాజమౌళి సైతం ప్రభాస్ తో చర్చలు స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మహేష్ బాబు సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు వేయిట్ చేయాల్సిందే.

Post a Comment

Previous Post Next Post