వంశీ పైడిపల్లి - విజయ్ 66.. సేఫ్ గేమ్!


కంటెంట్ డిఫరెంట్ గా ఉన్నా కూడా డైరెక్టర్ వంశీ పైడిపల్లి మేకింగ్ మాత్రం పక్కా కమర్షియల్ అనే కామేంట్స్ ఎక్కువగా వస్తుంటాయి. మున్నా అనంతరం ఈ దర్శకుడు చాలా వరకు సేఫ్ జోన్ లోనే హిట్స్ అందుకున్నాడు. అందుకే దిల్ రాజు అతనికి ఎక్కువగా ఛాన్సులు ఇస్తున్నాడు.

ఇక కోలీవుడ్ స్టార్ విజయ్ కూడా తన 66వ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో చేయడానికి కారణం కూడా అతను పక్కా కమర్షియల్ దర్శకుడు అని. అంతే కాకుండా మహర్షి సినిమాకు ఇటీవల నేషనల్ అవార్డు రావడం వల్ల కూడా విజయ్ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అలాగే తెలుగులో డైరెక్ట్ గా దిల్ రాజు లాంటి నిర్మాత ద్వారా సినిమా చేయడం మంచి అవకాశం కాబట్టి పెద్దగా నో చెప్పడానికి ఛాన్స్ లేదు. డైరెక్టర్ క్లారిటీ ఇచ్చినప్పటికీ విజయ్ ఇంకా అఫీషియల్ గా చెప్పేవరకు నమ్మలేము. ఎందుకంటే హీరోలు ఈ రోజుల్లో పూర్తి స్క్రిప్ట్ నమ్మకంగా ఆనిపిస్తే గాని ఒప్పుకోవడం లేదు. నచ్చకపోతే లాస్ట్ మినట్ లో కూడా హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. మరి విజయ్ ఏం చేస్తాడో చూడాలి.


Post a Comment

Previous Post Next Post