నాగార్జున కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్?


కింగ్ నాగార్జున రొమాంటిక్ సినిమాలను చేయడంలో ఎంత డిఫరెంట్ ఆలోచిస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ మన్మథుడిగా ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేసుకున్న ఈ స్టార్ హీరో హీరోయిన్స్ విషయంలో కూడా విభిన్నంగా ఆలోచిస్తాడు. సోగ్గాడే చిన్న నాయనా సినిమాలో ఏకంగా రమ్యకృష్ణతో చిన్నపాటి కెమిస్ట్రీని నడిపించి విజిల్స్ వేయించాడు. 

ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న బంగార్రాజు కథ సెట్టవ్వడంతో ఇప్పుడు హీరోయిన్ ఎవరనే విషయంలో సస్పెన్స్ నెలకొంది. ఇక దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కొంతమంది బాలీవుడ్ బ్యూటీలు పేర్లను అనుకోగా నాగ్ అందులో సోనాక్షి సిన్హాను ఫిక్స్ చేసినట్లు సమాచారం. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ వంటి అగ్ర హీరోలతో నటించిన ఈ బ్యూటీ పాత్ర నచ్చితే బాషాభేదం లేకుండా నటించాడనికి ఒప్పుకుంటుంది. ఇక పక్కా కమర్షియల్ సినిమా అయినటువంటి బంగార్రాజు సినిమా ఆఫర్ కు ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. త్వరలోనే హీరోయిన్ విషయంలో చిత్ర యూనిట్ అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వనుందట.


Post a Comment

Previous Post Next Post