సినిమాలకు రాజకీయాలకు విడదీయలేని బంధం ఉంది. అయితే ఫలితాలు మాత్రం ఊహించని విధంగా ఉంటున్నాయి. సినిమా క్లైమాక్స్ లో స్టార్స్ గెలిచినట్లుగా నిజ జీవితంలో గెలవడం అనేది అంత ఈజీ కాదని అర్ధమయ్యింది. ఇక నటుడిగా విజిల్స్ వేసిన జనాలు అంత ఈజీగా ఓట్లు వేయడం లేదు. తమిళనాడు ఎన్నికల్లో కమల్ హాసన్ దారుణంగా ఓటమి పాలవ్వడంతో మరోసారి ఈ విషయం అర్ధమయ్యింది.
పవన్ కళ్యాణ్ తరహాలోనే కమల్ హాసన్ కు వెన్నుపోటు దెబ్బ పడిందనే చెప్పాలి. ఎందుకంటే కమల్ హాసన్ కూడా అనేక సందర్భాల్లో పలు విరాళాలు అంధించాడు. ఎలాంటి మీటింగ్ పెట్టినా కూడా జనాల మద్దతు బాగానే లభించింది. ఒక విదంగా పవన్ కళ్యాణ్ వెనుక యువత ఎక్కువ శాతం నడువగా కమల్ హాసన్ వెనుక మాత్రం అన్ని వయసుల వాళ్ళు నడిచారు. కానీ చివరికీ ఆయనతో పాటు 142 స్థానాల్లో పోటీ చేసిన పార్టీ సభ్యులు కూడా ఓటమి చెందారు. పవన్ తరహాలోనే కమల్ హాసన్ కూడా ఎక్కడా డబ్బు పంచలేదు. కానీ ఆయన రాజకీయాల్లోకి రానివ్వకూడదని ప్రత్యర్థి పార్టీలు భారీ స్థాయిలో ఖర్చు చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి.
Follow @TBO_Updates