తారక్ తనయుడి అక్షరాభ్యాసం.. లేటెస్ట్ క్లిక్!


జూనియర్ ఎన్టీఆర్ ఎంత పెద్ద స్టార్ గా ఉన్నా కూడా ఒక ఫ్యామిలీ మ్యాన్ గా ఉండడానికే ఎక్కువగా ఇష్టపడతాడు. తారక్ ఎంత బిజీగా ఉన్నా కూడా కొడుకులతో టైమ్ స్పెండ్ చేయకుండా అస్సలు ఉండలేడు. చిన్నప్పుడు తండ్రీకి కాస్త దూరంగానే పెరిగిన జూనియర్ తన కొడుకులు మాత్రం అలాంటి లైఫ్ ను మిస్సవ్వకూడదని వారికి సంబంధించిన ప్రతి ఈవెంట్ లో ఉంటున్నాడు.

ఇక చిన్న కొడుకు భార్గవ్ రామ్ కు దగ్గరుండి అక్షరాభ్యాసం చేయించారు. ఆదివారం తన స్వగృహంలో పండితుల సమక్షంలో భార్గవ్ రామ్ కు అక్షరాభ్యాసం చేయించగా జూనియర్ ఎన్టీఆర్ ఒక పూజారితో ఫొటో దిగాడు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కోవిడ్ నుంచి బయటపడిన విషయం తెలిసిందే. ఇక ఈ హీరో RRRకు సంబంధించిన ఆఖరి షెడ్యూల్ త్వరలోనే మొదలు కానుంది. ఆ తరువాత కొరటాల శివ ప్రాజెక్టును స్టార్ట్ చేయనున్నారు.


Post a Comment

Previous Post Next Post