బిగ్ మూవీస్.. బ్యాలెన్స్ షూటింగ్ ఎంత ఉందంటే?


కరెక్ట్ గా టాలీవుడ్ లో బిగ్ మూవీస్ సెట్టయిన సమయంలోనే కరోనా తీవ్రంగా దెబ్బ కొట్టింది. ఎక్కడి షూటింగ్స్ అక్కడే ఆగిపోయాయి. ఇక ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న బడా సినిమాల షూటింగ్స్ ఎంతవరకు పూర్తయ్యయనే వివరాల్లోకి వెళితే ముందుగా ప్రభాస్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ మరో 10రోజుల వర్క్ చేస్తే షూటింగ్ అయిపోతుంది. కృష్ణంరాజుకు సంబంధించిన కొన్ని సీన్స్ ను షూట్ చేయాల్సి ఉంది.

ఆచార్యలో ఒక సాంగ్ తో పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలు పూర్తి కావాల్సి ఉంది. ఇక సర్కారు వారి పాట 20% షూటింగ్ మాత్రమే పూర్తవ్వగా హరహర వీరమల్లు 40% షూటింగ్ పూర్తయినట్లు టాక్. RRR 90% షూటింగ్ పూర్తయ్యింది. ఇక  పుష్ప మొదటి పార్ట్ పూర్తవ్వాలి అంటే 30 రోజులు షూటింగ్ చేయాలి. దాదాపు ఈ సినిమాల రిలీజ్ డేట్స్ అన్ని కూడా తారుమరయ్యే అవకాశం ఉంది. రిలీజ్ డేట్స్ లో మార్పులు వచ్చినా రాకున్నా షూటింగ్ మాత్రం ముందే పూర్తి చేసుకోవాలని దర్శకులు హీరోలు ప్లాన్స్ చేసుకుంటున్నారు.


Post a Comment

Previous Post Next Post