పవన్ కళ్యాణ్ మరోక పాన్ ఇండియా మూవీ?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా బిగ్ సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. వకీల్ సాబ్ హిట్టుతో మార్కెట్ కూడా స్టాండర్డ్ గానే ఉన్నట్లు క్లారిటీ వచ్చేసింది. దీంతో ఏకంగా పాన్ ఇండియా వరకు వచ్చేశారు. హరిహర వీరమల్లు సినిమాను దర్శకుడు క్రిష్ పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాను కూడా లైన్ లో పెడుతున్నట్లు టాక్ వస్తోంది. దర్శకుడు మరెవరో కాదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనే సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతకొంతకాలంగా త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్లో మరో సినిమా రవడా పక్కా అనే టాక్ అయితే వస్తోంది. కోబలి స్క్రిప్ట్ అని కూడా అన్నారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా అనే టాక్ వైరల్ అవుతోంది. మరి ఈ న్యూస్ ఎంత వరకు నిజమవుతుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post