రామ్ - లింగుస్వామి విలన్.. ఆ హీరో కాదు!


రామ్ పోతినేని మొదటిసారి ఒక ద్విభాషా సినిమాతో సిద్దమవుతున్న విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్న న్యూ మూవీలో రామ్ మరోసారి పవర్ఫుల్ మాస్ రోల్ లో కనిపించే అవకాశం ఉందట. ఇక ఆ మూవీలో విలన్ పాత్ర చాలా కీలకం కావడంతో దర్శకుడు మాధవన్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు ఇటీవల కథనాలు వచ్చాయి.

అయితే అందులో ఎలాంటి నిజం లేదని హీరో మాధవన్ క్లారిటీ ఇచ్చేశాడు. నిజానికి ఆ దర్శకుడితో తనకు మంచి స్నేహం ఉందని లవ్లీ పర్సన్ అంటూ చెప్పుకొచ్చారు. ఇక లింగుస్వామి తెలుగులో చేయనున్న సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని వివరణ ఇచ్చారు. దీంతో మొత్తానికి రూమర్ అని తేలిపోయింది.  మరి ఆ పవర్ఫుల్ విలన్ పాత్రకు దర్శకుడు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడో చూడాలి.


Post a Comment

Previous Post Next Post