అఖిల్ సినిమా లో మరో స్టార్ హీరో.. పవర్ఫుల్ రోల్!


అక్కినేని యువ హీరో అఖిల్ మొదటిసారి ఒక డిఫరెంట్ పాత్రతో బాక్సాఫీస్ హిట్టు కొట్టేలా ఉన్నాడు. 5వ సినిమా కాస్త భిన్నంగా రూపొందుతోంది. మొదట్లో అఖిల్ రెగ్యులర్ ఫార్మాట్ లోనే సినిమాలు చేశాడు. అఖిల్ , హలో, మిస్టర్ మజ్ను సినిమాలు వరుసగా నిరాశపరిచాయి. రాబోయే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పై కూడా పెద్దగా అంచనాలు అయితే లేవు.

ఇక సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న ఏజెంట్ సినిమా మాత్రం ఎదో వండర్ క్రియేట్ చేసేలా ఉందని అర్ధమవుతోంది. ఫస్ట్ లుక్ తోనే డిఫరెంట్ గా దర్శనమివ్వడం జనాలకు బాగా నచ్చింది. ఇక ఇప్పుడు సినిమాలో కన్నడ హీరో ఉపేంద్ర కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు టాక్ వస్తోంది. సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఒక ముఖ్యమైన పవర్ఫుల్ పాత్ర కోసం ఉపేంద్రను సంప్రదించినట్లు సమాచారం. మరి ఈ సినిమాతో అయినా అఖిల్ మొదటి హిట్టు అందుకుంటాడో లేదో చూడాలి.


Post a Comment

Previous Post Next Post