మెగాస్టార్ చిరంజీవి మొదటిసారి తనయుడు రామ్ చరణ్ తో ఫుల్ లెన్త్ రోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో మెగా హీరోలు ఎలా ఉంటారా? అని అభిమానులు అంచనాల స్థాయిని పెంచేసుకుంటున్నారు. అయితే మరొక సినిమాలో కూడా మెగాస్టార్ తో మరొక మెగా హీరో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య అనంతరం లూసిఫర్ రీమేక్ లో నటించనున్న విషయం తెలిసిందే. ఒరిజినల్ కథలో టోవినో థామస్ నటించిన ఒక హై క్లాస్ పాత్రలో వరుణ్ తేజ్ నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. విదేశాల నుంచి వచ్చి సీఎం స్థానం దక్కించుకోవడానికి ప్రయత్నం చేసే ఆ పాత్ర సినిమాలో చాలా కీలకం. ఇక దర్శకుడు మోహన్ రాజా ఆ పాత్ర కోసం వరుణ్ తేజ్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే సినిమా లాంచ్ అయ్యే వరకు వేయిట్ చేయాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment