రాజ్ కుంద్రా కేసు: 122 అశ్లీల సినిమాలకు.. చిన్న డీల్?


శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అడల్ట్ సినిమాల బాగోతం మరింత సిరియస్ గా మారుతోంది. ఇప్పటికే కస్టడీని మారో వారం పాటు పొడిగించిన అధికారులు అనేక రకాలుగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇటీవల శిల్పా శెట్టి - రాజ్ కుంద్రా ఉంటున్న ఇంటిలో  మరోసారి సోదాలు నిర్వహించారు.

వారి ఇంటి నుంచి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. అందులో భారీగా వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. ఇక మొత్తంగా 122 సినిమాల నిర్మాణానికి రూ.9 కోట్ల ఒప్పందం కూడా కుదిరినట్లు తెలుస్తోంది. ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న తరహా మోడల్స్ ను టార్గెట్ చేసి అశ్లీల సినిమాలను తీసినట్లు వాట్సాప్‌ చాటింగ్‌ ద్వారా లీక్ అయ్యాయి. వాట్సాప్ చాటింగ్స్ ద్వారానే ఎక్కువ ఆధారాలు లబించినట్లు సమాచారం. ఈ కేసు నుంచి బయటపడేందుకు రాజ్ కుంద్రా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.


Post a Comment

Previous Post Next Post